Re opening of Narenjayan Studio

Bhoomika Creative Dance Centre , a well established dance reportery in Delhi. Pt Narendra Sharma started this group mid 90’s, for the progress of contemporary dance in Delhi, the group has produced very intersting dance productions.The rehearsals place at Bhoomika named after them. The studio has re built and opened today. Under the directorship of Bharat Sharma, Bhoomika will be going to make it’s own mark in Indian contemporary dance by its future activities. Bhoomika Creative Dance Centre

Advertisements

Dell Designathon

Dell Designathon a workshop for designers organised by Dell at Delhi and other multiple metro cities. Royaala Theatre Society with it’s team members attended and experienced the workshop in a good manner.

The team tried to bringout the different elements of interactive Media Design by incorporating the cognative memories. They tried to create a wall where the media depend on the memory will change the mood of an individual.

మిసైల్ మ్యాన్ Missile Man

A dance drama on Biography and his works of Dr.A.P.J. Kalam presented by space performing arts performed on 31st August 2017 at Shri Ram Centre Delhi

Play Name : Missile Man

Director/Choreographer : Raja Anand

Performance Place :, Shri Ram Centre, Delhi

Date : 31st August 2017

Lights Design by Murali Basa

About The Performance

रामवेशरम मे पैदा हुए एक बालक से लेकर भारत के ग्यारहवे राष्ट्पति बनने तक डॉ.ए.पी.जे अब्दूल कलाम का जीवन असाधारण सकलंप, शाक्ति, साहस, लगन, और सफलता की चाह की प्रेरणाप्रद कहानी है| .उनकी कामयाबी के पीछे क्या दासता थी संघर्ष की गजब के समर्पण की कलाम साहब हमारे बीच नहीं, मगर यह किस्से इन्सानी नसल के लिए प्रेरना देने वाले है |

Kalams journey, opening of the performance

Missile Man

New’s Report

రాయల థియేటర్ సొసైటీ, పొందూరు _ కళల పోటిలు

Tags

, , , , , , , , , , , ,

నమస్కారం.

గౌరవనీయులు ప్రధానోపాధ్యాయులు , జిల్లా పరిషత్ /ఉన్నత పాఠశాల. ——– గ్రామం, ———– మండలం, శ్రీకాకుళం జిల్లా.

విషయం: జిల్లా స్థాయి చిత్రలేఖనం, కథల రచన, కవితల రచన, ఛాయా చిత్రాల మరియు నాటిక రచనల పోటీల దరఖాస్తులకు సంభందించి ఆహ్వాన పత్రిక

రాయల థియేటర్ సోసైటీ

రాయల థియేటర్ సోసైటీ

అయ్యా!

విద్యార్ధుల్లో కథల పట్ల, నాటకాల పట్ల, సాంప్రదాయ నృత్యాల పట్ల ఆసక్తిని మరియు అభిరుచిని పెంపొందించాలని , సెలవుల సమయాన్ని సద్వినియోగం పరిచే విధంగా ఈ క్రింది పోటీలు “రాయల థియేటర్ సొసైటీ” , పొందూరు వారిచే నిర్వహించడం జరుగుతుంది. తద్వారా విద్యార్దుల్లో సృజనాత్మక విలువలు పెంచగోరుతున్నాము. కాబట్టి జిల్లాలోని ఉపాద్యాయులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు. మరియు కార్యచరణతో కూడిన మా భవిష్యత్ కార్య క్రమాలలో పాల్గొని సోసైటీ యొక్క ఆశయాల్లో పాలు పంచుకోగలరు. పాల్గొన్న విద్యార్దులుకు మరియు తరగతి ఉపాధ్యాయులకు తే ఆగష్టు 15, 2015 దీన జరగబోవు కార్యక్రమంలో తగిన పారితోషికాలు మరియు మెమొంటోలు తో సత్కరించడం జరుగుతుంది. మరియు ఈ పోటీ విజేతల ద్వారా వచ్చిన విలువైన విషయాలన్ని పుస్తకం ద్వారా ప్రచురించడం జరుగుతుంది.

చిత్రలేఖనం:

విబాగం1: 6 మరియు 7 తరగతులు విద్యార్థులు.

అంశాలు: 1. ప్రకృతి వైపరీత్యాలు 2. గ్రామ సమాజం మరియు పట్టణ సమాజం 3. భిన్న ప్రదేశాలు

విభాగం 2 :8మరియు9 తరగతి విద్యార్థులు అంశాలు: 1. ఆదర్శ వ్యక్తి 2. స్వచ్ఛ భారత్ 3.గ్లోబలైజేషన్

ధరఖాస్తు విధానం:

1. విద్యార్థి A4 ఛార్ట్ పేపర్ పై పెన్సిల్ మరియు కలర్స్ / రంగలు ద్వారా వేయవలెను.

2. విద్యార్థి వేసిన చిత్రాన్ని తరగతి ఉపాద్యాయుడు/ఉపాద్యాయని ద్వారా సంతకం చేయ వలెను.

3. పాఠశాల ప్రదానోపాద్యుడుచే జారీచేసిన స్టడీ సర్టిఫికేట్ జత చేయవలెను.

4. విద్యార్థి యొక్క బయో డేటా జతచేయవలెను. (బయో డేటా యందు 1. విద్యార్థి పేరు 2. తండ్రి పేరు 3. చిరునామా 4. తండ్రి బ్యాంకు ఎకౌంట్ వివరాలు 5. విద్యార్థి ముందు తరగతి మార్కులు 6. విద్యార్థి సంతకం 7. తండ్రి/తల్లి/సంరక్షకుని సంతకం)

5. విద్యార్ది ద్వారా క్రింది విధంగా హామి పత్రం

హామి పత్రం:

నేను ————— s/o ————– , ——- తరగతి యందు ———– స్కూలు, ——గ్రామం , ——– మండలం, శ్రీకాకుళం జిల్లా యందు చదువుచున్నాను. రాయల థియేటర్ సొసైటీ నిర్వహిసుతున్న పోటీలుకు గాను నా ఇష్ట పూర్వకంగా నా స్వహస్తాలతో గీసిన/రాసిన/తీసిన ———రంగానికి సంబందించిన ఎంట్రీని పంపిస్తున్నాను. దీనికి సంబందించిన అర్హతులు చదివియున్నాను.

విద్యార్థి సంతకం                                           ప్రదానోపాద్యుని/తరగతి ఉపాధ్యాయునిసంతకం

6. ఒక్కో తరగతి నుండి గరిష్టంగా 5 ధరఖాస్తులను పంపించవచ్చు.

7. దరఖాస్తులను చేరవలసిన ఆఖరి తేది 22 జూలై 2015.

8. దరఖాస్తులను రిజస్టర్ పోస్ట్ ద్వారా To The Secretary “Royaala Theatre Society” 2-71, Moogodivari veedhi PONDURU Srikakulam (Dist) A P -532168 అనే చిరునామాకు కవర్ పై పోటీ పేరు విభాగం మరియు స్కూల్ పేరు రాసి పంపించ గలరు లేదా E-mail ద్వారా royaalatheatre@gmail.com అనే మెయిల్ కు డాక్యుమెంట్స్ ను అటచ్ చేస్తూ పంపించ గలరు. (గమనిక : ఈ మెయిల్ ద్వారా పంపించిన వారు Subject నందు “చిత్రలేఖన పోటీకొరకు” అని స్పేస్ ఇచ్చి విద్యార్థి పేరు స్పేస్ ఇచ్చి విభాగం మరియు గ్రామం పేరు రాయవలెను. ఉదాహరణకు “చిత్రలేఖన పోటీకొరకు” రామకృష్ణ పొందూరు అని సబ్జెక్ట్ నందు రాయవలెను) ఈమెయల్ పంపించే వారు పైన చెప్పిన 1. స్టడీ సర్టిఫికేట్ 2. హామి పత్రం 3. బయోడేటా 4. పోటీ పత్రం మొదలగు పత్రాలను స్కాన్ చేసి , సబ్జెక్ట్ నందు పైన తెలిపిన విధంగా రాసి జిప్ ఫైల్ ద్వారా పంపించగలరు. ఫైల్ గరిష్టంగా 15MB కన్నా తక్కువుగా ఉండేటట్లు చూడవలెను.

కధల రచన:

విభాగం 1: 6 మరియు 7తరగతులు

పుల్ పేజీ కధలు : విద్యార్థులు తమకు నచ్చిన విధంగా కధను రాసి మీ ఉపాద్యాయుడు ద్వారా చర్చించి అవసరమైన మార్పులును చేసి A4 తెల్ల కాగితమనందు గుండ్రటి అక్షరాలతో స్వదస్తూరితో ఒక వైపు రాసి గరిష్టంగా 8 పేజీల లోపు పూర్తి చేయవలెను.

కార్డు కధలు: ఈ విభాగం నందు విద్యార్థులు మొత్తం కధను పోస్టాఫీసనందు లభ్యమయ్యే కార్డు నందు పూ ర్తి చేసి పంపించవలెను. పంపించే ముందు పైన పేర్కొనబడిన 2 నుండి 8 వరకు ఉన్న పాయింట్స్ గమనించి ఆ విధంగా పంపించగలరు.

విభాగం 2: 8 మరియు 9 తరగతులు విద్యార్థులు తమకు నచ్చిన విధంగా కధను రాసి మీ ఉపాద్యాయుడు ద్వారా చర్చించి అవసరమైన మార్పులును చేసి A4 తెల్ల కాగితమనందు గుండ్రటి అక్షరాలతో స్వదస్తూరితో ఒక వైపు రాసి గరిష్టంగా 8 పేజీల లోపు పూర్తి చేయవలెను.

కార్డు కధలు: ఈ విభాగం నందు విద్యార్థులు మొత్తం కధను పోస్టాఫీసనందు లభ్యమయ్యే కార్డు నందు పూ ర్తి చేసి పంపించవలెను. పంపించే ముందు పైన పేర్కొనబడిన 2 నుండి 8 వరకు ఉన్న పాయింట్స్ గమనించి ఆ విధంగా పంపించగలరు.

కవితల రచన:

విభాగం 1: 6మరియు 7 తరగతులు:  విద్యార్థులు తమకు నచ్చిన విధంగా కవితను రాసి మీ ఉపాద్యాయుడు ద్వారా చర్చించి అవసరమైన మార్పులును చేసి A4 తెల్ల కాగితమనందు గుండ్రటి అక్షరాలతో స్వదస్తూరితో ఒక వైపు రాసి గరిష్టంగా 2 పేజీల లోపు పూర్తి చేయవలెను.

విభాగం 2 : 8 మరియు 9తరగతులు విద్యార్థులు తమకు నచ్చిన విధంగా కవితను రాసి మీ ఉపాద్యాయుడు ద్వారా చర్చించి అవసరమైన మార్పులును చేసి A4 తెల్ల కాగితమనందు గుండ్రటి అక్షరాలతో స్వదస్తూరితో ఒక వైపు రాసి గరిష్టంగా 2 పేజీల లోపు పూర్తి చేయవలెను.

నాటిక రచనల పోటీ : ఇది కేవలం విభాగం 2 (8మరియు 9) విద్యార్దులకు మాత్రమే. విద్యార్థి తనకు నచ్చిన అంశాన్ని తీసుకొని గరిష్టంగా 20 నుండి 25 పేజీల వరకు నాటకాన్నీ పేజీకీ ఒక వైపు గుండ్రటి అక్షరాలతో రాయవలెను. ఉత్తమంగా రాసిన నాటికను తగిన మార్పులు చేర్పులు చేసి భవిష్యత్తులో ప్రదర్శన చేయడం జరుగుతోంది.

ఛాయ చిత్రాల పోటీ : ఇది కేవలం విభాగం 2 (8 మరియు 9 తరగతి) విద్యార్దులు కు మాత్రమే. విద్యార్దులు తల్లి దండ్రులు లేదా బంధువుల వద్ద మొబైల్ ఫోన్ ద్వారా గ్రామ పరిసర ప్రాంతాలు లేదా గ్రామంలో జరిగిన వివిధ అంశాలు లేదా అందమైన విషయాలను ఛాయ చిత్రాలుగా తీసి ఫోటో స్టూడియో లో కడిగించి ఫోస్ట్ ద్వారా పైన తెలిపిన 2నుండి 8 పాయింట్లు గమనించి పంపించగలరు.

విభాగం 3. ఈ విభాగం విదేశాల్లో ఉండే శ్రీకాకుళం జిల్లా వాసులకు. ఈ విభాగం నందు ఎంట్రీ లు ప్రత్యేకంగా పరిశీలించబడును. విదేశీ ఎంట్రీలు కేవలం ఈ మెయిల్ ద్వారా స్వీకరించబడును. ఎంట్రీలతో పాటు స్టడీ సర్టిఫికేట్, హామి పత్రం, బయోడేటా మరియు క్లాస్ టీచర్ చే కాండక్ట్ సర్టిఫికేట్ జిప్ ఫైల్ ద్వారా పంపించగలరు. విద్యార్థులు రాసినవి తల్లి దండ్రులు అవసరమైన భాష పరమైన విషయాలయందు సహాయం చేయవచ్చు.

ప్రత్యేక సూచనలు:

I. ప్రతి ధరఖాస్తు ప్రదానోపాద్యుని సంతకం మరియ స్టాంప్ కలిగి యుండవలెను.(అట్లు  లేని యెడల పరిశీలనకు  పరిగినించబడదు)

II.మీ బంధువుల్లో ఎవరైనా విదేశాల్లో ఉంటే వారి ధరఖాస్తులు ఆన్లైన్ ద్వారా పంపించ గలరు.(విభాగం 3 చదవగలరు)

III. పైన తెలిపిన 2 నుండి 8 వరకు గల అంశాలను పరిశీలించి గలరు.

IV. ప్రతీ పాఠశాల నుండి, ప్రతీ విభాగం నుండి, ప్రతీ పోటీ కు గరిష్టంగా 5 ధరఖాస్తులను పంపించ వలెను. (అనగా ఒక్కోక్క పాఠశాల నుండి అన్ని  పోటీలకు  కలిపి గరిష్టంగా 140 ధరఖాస్తులు మాత్రమే పంపించ గలరు.)

V. ధరఖాస్తులు రిజస్టర్ పోస్ట్ ద్వారా లేదా పైన పేర్కొన్న విధంగా ఈ మెయిల్ ద్వారా పంపించగలరు.

VI. మాకు అందిన ధరఖాస్తులుకు పోస్ట్ ద్వారా 3 రోజుల్లో ఎక్నాలెడ్జ్మెంట్ కార్డు ద్వారా మరియు ఆటోమెటిక్ మెయిల్ ద్వారా వెనువెంటనే రిప్లై మెయిల్ వచ్చినట్ట్లైతే మీ ధరఖాస్తు స్వీకరించబడింది అని అర్ధం.

VII. అనుభవఙ్ఞులైన ఉపాధ్యాయ బృందం మరియు రాయల్ థియేటర్ సొసైటీ మెంబర్స్ ఎంట్రీలను పరిశీలించి విజేతలను ప్రకటిస్తారు.

VIII. ప్రతి విభాగం నందు మరియు ప్రతి పోటీ యందు ప్రధమ బహుమతి రూ.516, ద్వితీయ బహుమతి రూ.216 తృతీయ బహుమతి 116 పారితోషకం,మెమెంటో మరియు ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరుగుతోంది. (పారితోషకం అప్లికేషన్లో తెలుపబడిన బ్యాంక్ అకౌంట్ నందు జమచేయడం జరుగుతుంది). మిగిలిన విద్యార్దులకు పోస్ట్ ద్వారా ప్రశంసా పత్రాలు సెప్టంబర్ మొదటి వారం లోపు అందజేయడం జరుగుతుంది.

VIII B. NRI విద్యార్దులకు కేవలం ప్రశంసా పత్రం మరియు మెమెంటో బంధువులకు అందజేయడం జరుగుతోంది.

IX. విజేతలు తమ ప్రదానోపాద్యుడు లేదా తరగతి ఉపాద్యాయుడు తో 15, ఆగష్టు 2015 సాయంత్రం పొందూర్లో జరగబోయే కార్యక్రమానికి హాజరు కాగలరు. రాను పోనూ ఖర్చులు సోసైటీకీ బస్ లేదా ట్రైన్ టికెట్ జమచేయడం ద్వారా డబ్బులు తిరిగి పొందవచ్చు.

X. కార్యక్రమానికి సంబందించిన పూర్తి వివరాలతో కూడిన సమాచారం మే మూడవ వారంలో www.royaalatheatre.wordpress.com నందు పరిశీలించ గలరు.

XI. ప్రతి ఉపాద్యాయుడు లేదా పాఠశాల నుండి ఏదైనా ఉపాద్యాయుడు What’s app ద్వారా 9493938573 అను నంబరు యందు గాని, facebook ద్వారా లేదా మెయిల్ ద్వారా మే చివరి వారం నుండి ఆగష్ట్ 15 వరకు ఉత్తర ప్రత్యుత్తారాలు జరపడానికి అందుబాటులో ఉండవలెను

XII. పోటీలకీ సంబందించిన తుది నిర్ణయం రాయల థియేటర్ సెక్రటరీ మరియు ప్రెసిడెంట్ తీసుకోవడం జరుగుతుంది.

విశేష సూచన :
ప్రతి విభాగానికి,ప్రతీ పోటికి , ప్రతి విద్యార్థి వద్ద నుండి  ప్రవేశ రుసుము  10/- చొప్పున వసూలు చేసి ఆ లిస్టు ని ప్రధాన ఉపాధ్యుడు  ద్వారా  పంపించ వలెను. ప్రధాన ఉపాధ్యాయుడు  ఆ రుసుముల మొత్తాన్ని  Royaala Theatre Society అను పేరు మీద DD ని తీసి జత చేయవలెను.
online విభాగం  నందు సమర్పించిన  వారు ప్రధాన  ఉపాధ్యాయునికి  రుసుము చెల్లించి లిస్టు నందు మీ పేరు ఎదురుగా  online లో అప్లికేషన్ సమర్పించ బడింది  అని పేర్కొన వలెను.
NRI applicants కు ప్రవేశ రుసుము నుండి మినహాయింపు కలదు.

Follow us on Face Book :https://www.facebook.com/royaalatheatresociety

Whats app Number: +91 9493938573

ఇట్లు,

(వడగా. సురేష్)

సెక్రటరీ

రాయల థియేటర్ సొసైటీ

2_70

మూగోడి వారి వీధి

పొందూరు

శ్రీకాకుళం జిల్లా

ఆంధ్ర ప్రదేశ్ 532168

+91 9177211393 +919989614901

email: royaalatheatre@gmail.com

ఉత్సవ్ UTSAV annual day of Mudra Academy

Tags

, , , , , ,

image

ఉత్సవ్

శ్రీ ముద్ర అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్సు , హైదారాబాద్లోని నగరమందు యోగా మరియు నాట్యం వంటి కళా నైపుణ్యాలను విద్యార్థులులో పెంపొందించే విధంగా శ్రీ సుధాకర్ మరియు శ్రీమతి హిమబిందు లచే 2009 స్థాపించడం జరిగింది. సాంస్కృతిక సాంప్రదాయాల పట్ల మరియు భరత నాట్యం యోగ లో పిల్లలుకు శిక్షణ ఇవ్వడం జరుగుతోంది.
శ్రీ మతి హిమబిందు చెన్నై యందలి శ్రీ రుక్మిణీ దేవి అరుండేళ్ కళాక్షేత్ర నుండి శిక్షణ పొందియున్నారు. ఆ తరువాత హైదరాబాద్ యూనివర్సిటీ నుండి భరతనాట్యం ఎమ్.ఎ చేసి , తెలుగు యూనివర్సిటీ నుండి ఎమ్.ఫిల్ చేసి ప్రస్తుతం హైదరాబాద్
విశ్వవిద్యాలయం నందు పరిశోధక విద్యార్దిణి  గా ఉన్నారు.

దేశ సాంస్కృతిక,  సాంప్రదాయ నాగరికత అద్దం పట్టే విధంగా మరియు విద్యార్థులు కు కళల పట్ల అవగాహన తో పాటు అసక్తిని పెంపొందించేలా భరతనాట్యం మరియు యోగ వంటి అంశాల్లో నైపుణ్యాలు పెంపొందించడం ముద్ర అకాడమీ ముఖ్య ఉద్దేశం.
సంస్థ ఆశయ సాధనలో భాగంగా ప్రతి యేటా “ఉత్సవ్” అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. షుమారు 30 మంది విద్యార్థులు శ్రీమతి హిమబిందు ద్వారా శిక్షణ పొంది అడుగు మాల,  అలరిపు, శబ్ధం, కీర్తనం, పదం, జావళీ, తిల్లాన వంటి నృత్య అంశాలు ప్రదర్శించడం జరిగింది.  షుమారు 4సం!! నుండి 22 సం!! వయస్సు ఉన్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం రవీంద్ర భారతీ ఆడిటోరియం నందు 31/01/15 సాయంత్రం 6:30 ని!! కి ప్రారంభమైన కార్యక్రమం చిన్నారి అడుగులు తో మొదలై  తిల్లాన తో చివరి వరకు ఆద్యంతం నాట్యం చేసి అబ్బురపరిచారు.
కార్యక్రమంలో ముఖ్య అతిధులగా శ్రీమతి వనిత భూపల్ మరియు శ్రీమతి గీతా గణేషన్ పాల్గొని విద్యార్థులు కార్యక్రమాన్ని తిలకించి విద్యార్థులు ఆశ్వీరదించడం జరిగింది. భరత నాట్యం పట్ల ఆసక్తి ని పెంపొందించే కార్యక్రమాన్ని మరియు ముద్ర అకాడమీ కృషిని ప్రశంసించారు. నాట్య గురువు శ్రీమతి హిమబిందు కార్యక్రమం నిర్వహించడం లో తమ భాద్యతను నిర్వర్తించడానికి నిర్విరామంగా కృషి చేశారు.
Lighting design :   మురళీ బాసా

అసి స్టేజ్ (ASI STAGE) ఇంటర్నేషనల్ ఫెస్టివల్

Tags

, ,

చిల్డ్రన్ థియేటర్ మరియు థియేటర్ ఫర్ యంగ్ ఆడియన్స్ అనగానే గుర్తొచ్చే ఆర్గనైజేషన్ అసి స్టేజ్. ఫిబ్రవరి నెల్లో పబ్లిక్ గార్డెన్స్ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం లో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జరుపనున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు కు పోస్టర్ చూడండి.

image

ASISTAGE

మెటా ( META) Mahindra excellence Theatre awards కొరకు దరఖాస్తు ల ఆహ్వానం

Tags

, ,

image

భారతీయ నాటక రంగంలో ప్రభుత్వేతర అవార్డ్ లో మెటా (Mahindra Excellence in Theatre Awards)  ఓ ప్రత్యేక స్ధానం కలిగి యుంది. ప్రారంభించి చాలా సంవత్సరాల అవుతున్న తెలుగు నాటకం రంగం నుండి ఇప్పటి వరకు ఒక్క entryకూడ వెళ్ళలేదు. నేషనల్ లెవల్/జాతీయ స్థాయిలో తెలుగు నాటక రంగం రిప్రెజెంట్ చెయ్యడానికి ఇదో గొప్ప అవకాశం. తెలుగు నవతర దర్శకత్వంలో వచ్చిన కొత్త నాటకాలు ఈ ఫెస్టివల్ కు పంపించండి. మరిన్ని వివరాలు కు ఈ క్రింది website link పరిశీలించ ప్రార్ధన.
The prestigious non govt award by Mahindra Group META ( Mahindra Excellence in Theatre Award has its own place in Indian Theatre. It’s an opportunity to everyone to participate in the festival by sending their production. For more details see the link

http://metawards.com/v1/selection-criteria/

పూరి ప్రయత్నానికి పూర్తి సహకారం

మనిషి కో బుధ్ధి ..జివ్హోకో రుచి. కాని ఒక్కోక సారి ఒకటే రుచి కలిగిన వాళ్ళు తారస పడుతుంటారు. దర్శకుడు పూరి జగన్నాథం చేస్తున్న ప్రయత్నం మా గ్రూప్ ఆబ్జెక్టివ్ లో ఒకటి. Encourage young directors for short films. మీ లో ఎవరికైన ఆ పది సినిమా ల్లో ఏదో ఒక సినిమా తియ్యడానికి కావలసిన actors and technical team అందించడానికి, రాయోలా థియేటర్ సొసైటీ సపోర్ట్ చెయ్యడానికి ముందుకు వస్తుంది.
మరిన్ని వివరాలు కు మురళీ బాసా , ప్రెసిడెంట్ 9989614901
http://www.royaalatheatre.wordpress.com

image
image
Idea 2
image
Idea 3

నూతన సంవత్సర శుభాకాంక్షలు

Tags

మిత్రులుకు , స్నేహితులుకు, కళాకారులుకు, కళా ప్రోత్సహాకులుకు, నాటక రంగ ప్రముఖులు కు నాటక దిగ్గజాల కు, దర్శకులుకు, మేధావులుకు, గురువులుకు, సాంప్రదాయ నృత్య కళాకారులు కు, జానపద కళాకారులుకు, ప్రేక్షక మహాదేవుళ్ళుకు, అందిరికీ రాయోలా థియేటర్ సొసైటీ తరుపున నూతన సంవత్సర శుభాకాంక్షలు.

image

నూతన సంవత్సర శుభాకాంక్షలు

మురళీ బాసా.
ప్రెసిడెంట్

Chat

నగరంలో నార్త్ ఈస్ట్ థియేటర్ ఫెస్టివల్

image

Ratan Thiyam Macbeth (Source Google Images/Telegraph

ఓ అద్భుతమైన అవకాశం హైదరాబాద్ ఆడియన్స్ కి. నగరంలో నార్త్ ఈస్ట్ థియేటర్ ఫెస్టివల్ డిసెంబరు నెల 23 24 25 తేదీల్లో రవీంద్ర భారతీ ఆడిటోరియం లో 26 మరియు 27 తేదీల్లో లలిత కళాతోరణంలో జరుగనుంది. కార్యక్రమం దిగ్గజ దర్శకుడు, రంగస్థలి విజువల్ మాంత్రికుడు రతన్ తీయం దర్శకత్వం వహించిన షేక్స్పియర్ “మెక్బెత్” 23 తేదీన రవీంద్ర భారతీ లో సాయంత్రం 6:30 ని.లకు ప్రదర్శన జరుగనుంది. ప్రతిఒక్కరూ చూడాల్సిన ప్రదర్శన. హైదరాబాద్ ఆడియన్స్ కు ఇది ఓ అద్భుతమైన అరుదైన అవకాశం. If not today you can’t ever.
ప్రదర్శన చూడడానికి ఆహ్వాన పత్రాల ద్వారా మాత్రమే ప్రవేశం. ఆహ్వాన పత్రాల కోసం రవీంద్ర భారతీ వద్ద గల కల్చరల్ ఆఫీసు నందు సంప్రదించ గలరు. 24, 25 26 27 వరకు జరగబోయే ఈ ఫెస్టివల్ వివరాలు అన్ని ప్రదాన పత్రికలో ప్రచురించడం జరిగింది. కాబట్టి మీరు ఏ కారణం చేత నైన హైదరాబాద్ లో ఉన్నట్లయితే తప్పనిసరిగా చూడండి.
దయచేసి ఈ బ్లాగు ను షేర్ చేయడం ద్వారా గాని మరే ఇతర మాద్యమాల ద్వారా గాని సమాచారాన్ని కళాకారులు కు కళా ప్రోత్సాహకులుకు, కళాశాల కుర్రాళ్లుకు తెలియజేసి కళల పట్ల మీకున్న అభిమానాన్ని తెలియజేసి ఈ కార్యక్రమాన్ని జయప్రద చేయగోర ప్రార్ధన.