Tags
కధల రచన, కవితల రచన, కార్డు కధలు, చిత్రలేఖనం:, నాటిక రచనల పోటీ, పుల్ పేజీ కధలు, NRI, Painting, Photography, Play writing, RoyaalaTheatre Society, Srikakulam, Story writing
నమస్కారం.
గౌరవనీయులు ప్రధానోపాధ్యాయులు , జిల్లా పరిషత్ /ఉన్నత పాఠశాల. ——– గ్రామం, ———– మండలం, శ్రీకాకుళం జిల్లా.
విషయం: జిల్లా స్థాయి చిత్రలేఖనం, కథల రచన, కవితల రచన, ఛాయా చిత్రాల మరియు నాటిక రచనల పోటీల దరఖాస్తులకు సంభందించి ఆహ్వాన పత్రిక
అయ్యా!
విద్యార్ధుల్లో కథల పట్ల, నాటకాల పట్ల, సాంప్రదాయ నృత్యాల పట్ల ఆసక్తిని మరియు అభిరుచిని పెంపొందించాలని , సెలవుల సమయాన్ని సద్వినియోగం పరిచే విధంగా ఈ క్రింది పోటీలు “రాయల థియేటర్ సొసైటీ” , పొందూరు వారిచే నిర్వహించడం జరుగుతుంది. తద్వారా విద్యార్దుల్లో సృజనాత్మక విలువలు పెంచగోరుతున్నాము. కాబట్టి జిల్లాలోని ఉపాద్యాయులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు. మరియు కార్యచరణతో కూడిన మా భవిష్యత్ కార్య క్రమాలలో పాల్గొని సోసైటీ యొక్క ఆశయాల్లో పాలు పంచుకోగలరు. పాల్గొన్న విద్యార్దులుకు మరియు తరగతి ఉపాధ్యాయులకు తే ఆగష్టు 15, 2015 దీన జరగబోవు కార్యక్రమంలో తగిన పారితోషికాలు మరియు మెమొంటోలు తో సత్కరించడం జరుగుతుంది. మరియు ఈ పోటీ విజేతల ద్వారా వచ్చిన విలువైన విషయాలన్ని పుస్తకం ద్వారా ప్రచురించడం జరుగుతుంది.
చిత్రలేఖనం:
విబాగం1: 6 మరియు 7 తరగతులు విద్యార్థులు.
అంశాలు: 1. ప్రకృతి వైపరీత్యాలు 2. గ్రామ సమాజం మరియు పట్టణ సమాజం 3. భిన్న ప్రదేశాలు
విభాగం 2 :8మరియు9 తరగతి విద్యార్థులు అంశాలు: 1. ఆదర్శ వ్యక్తి 2. స్వచ్ఛ భారత్ 3.గ్లోబలైజేషన్
ధరఖాస్తు విధానం:
1. విద్యార్థి A4 ఛార్ట్ పేపర్ పై పెన్సిల్ మరియు కలర్స్ / రంగలు ద్వారా వేయవలెను.
2. విద్యార్థి వేసిన చిత్రాన్ని తరగతి ఉపాద్యాయుడు/ఉపాద్యాయని ద్వారా సంతకం చేయ వలెను.
3. పాఠశాల ప్రదానోపాద్యుడుచే జారీచేసిన స్టడీ సర్టిఫికేట్ జత చేయవలెను.
4. విద్యార్థి యొక్క బయో డేటా జతచేయవలెను. (బయో డేటా యందు 1. విద్యార్థి పేరు 2. తండ్రి పేరు 3. చిరునామా 4. తండ్రి బ్యాంకు ఎకౌంట్ వివరాలు 5. విద్యార్థి ముందు తరగతి మార్కులు 6. విద్యార్థి సంతకం 7. తండ్రి/తల్లి/సంరక్షకుని సంతకం)
5. విద్యార్ది ద్వారా క్రింది విధంగా హామి పత్రం
హామి పత్రం:
నేను ————— s/o ————– , ——- తరగతి యందు ———– స్కూలు, ——గ్రామం , ——– మండలం, శ్రీకాకుళం జిల్లా యందు చదువుచున్నాను. రాయల థియేటర్ సొసైటీ నిర్వహిసుతున్న పోటీలుకు గాను నా ఇష్ట పూర్వకంగా నా స్వహస్తాలతో గీసిన/రాసిన/తీసిన ———రంగానికి సంబందించిన ఎంట్రీని పంపిస్తున్నాను. దీనికి సంబందించిన అర్హతులు చదివియున్నాను.
విద్యార్థి సంతకం ప్రదానోపాద్యుని/తరగతి ఉపాధ్యాయునిసంతకం
6. ఒక్కో తరగతి నుండి గరిష్టంగా 5 ధరఖాస్తులను పంపించవచ్చు.
7. దరఖాస్తులను చేరవలసిన ఆఖరి తేది 22 జూలై 2015.
8. దరఖాస్తులను రిజస్టర్ పోస్ట్ ద్వారా To The Secretary “Royaala Theatre Society” 2-71, Moogodivari veedhi PONDURU Srikakulam (Dist) A P -532168 అనే చిరునామాకు కవర్ పై పోటీ పేరు విభాగం మరియు స్కూల్ పేరు రాసి పంపించ గలరు లేదా E-mail ద్వారా royaalatheatre@gmail.com అనే మెయిల్ కు డాక్యుమెంట్స్ ను అటచ్ చేస్తూ పంపించ గలరు. (గమనిక : ఈ మెయిల్ ద్వారా పంపించిన వారు Subject నందు “చిత్రలేఖన పోటీకొరకు” అని స్పేస్ ఇచ్చి విద్యార్థి పేరు స్పేస్ ఇచ్చి విభాగం మరియు గ్రామం పేరు రాయవలెను. ఉదాహరణకు “చిత్రలేఖన పోటీకొరకు” రామకృష్ణ పొందూరు అని సబ్జెక్ట్ నందు రాయవలెను) ఈమెయల్ పంపించే వారు పైన చెప్పిన 1. స్టడీ సర్టిఫికేట్ 2. హామి పత్రం 3. బయోడేటా 4. పోటీ పత్రం మొదలగు పత్రాలను స్కాన్ చేసి , సబ్జెక్ట్ నందు పైన తెలిపిన విధంగా రాసి జిప్ ఫైల్ ద్వారా పంపించగలరు. ఫైల్ గరిష్టంగా 15MB కన్నా తక్కువుగా ఉండేటట్లు చూడవలెను.
కధల రచన:
విభాగం 1: 6 మరియు 7తరగతులు
పుల్ పేజీ కధలు : విద్యార్థులు తమకు నచ్చిన విధంగా కధను రాసి మీ ఉపాద్యాయుడు ద్వారా చర్చించి అవసరమైన మార్పులును చేసి A4 తెల్ల కాగితమనందు గుండ్రటి అక్షరాలతో స్వదస్తూరితో ఒక వైపు రాసి గరిష్టంగా 8 పేజీల లోపు పూర్తి చేయవలెను.
కార్డు కధలు: ఈ విభాగం నందు విద్యార్థులు మొత్తం కధను పోస్టాఫీసనందు లభ్యమయ్యే కార్డు నందు పూ ర్తి చేసి పంపించవలెను. పంపించే ముందు పైన పేర్కొనబడిన 2 నుండి 8 వరకు ఉన్న పాయింట్స్ గమనించి ఆ విధంగా పంపించగలరు.
విభాగం 2: 8 మరియు 9 తరగతులు విద్యార్థులు తమకు నచ్చిన విధంగా కధను రాసి మీ ఉపాద్యాయుడు ద్వారా చర్చించి అవసరమైన మార్పులును చేసి A4 తెల్ల కాగితమనందు గుండ్రటి అక్షరాలతో స్వదస్తూరితో ఒక వైపు రాసి గరిష్టంగా 8 పేజీల లోపు పూర్తి చేయవలెను.
కార్డు కధలు: ఈ విభాగం నందు విద్యార్థులు మొత్తం కధను పోస్టాఫీసనందు లభ్యమయ్యే కార్డు నందు పూ ర్తి చేసి పంపించవలెను. పంపించే ముందు పైన పేర్కొనబడిన 2 నుండి 8 వరకు ఉన్న పాయింట్స్ గమనించి ఆ విధంగా పంపించగలరు.
కవితల రచన:
విభాగం 1: 6మరియు 7 తరగతులు: విద్యార్థులు తమకు నచ్చిన విధంగా కవితను రాసి మీ ఉపాద్యాయుడు ద్వారా చర్చించి అవసరమైన మార్పులును చేసి A4 తెల్ల కాగితమనందు గుండ్రటి అక్షరాలతో స్వదస్తూరితో ఒక వైపు రాసి గరిష్టంగా 2 పేజీల లోపు పూర్తి చేయవలెను.
విభాగం 2 : 8 మరియు 9తరగతులు విద్యార్థులు తమకు నచ్చిన విధంగా కవితను రాసి మీ ఉపాద్యాయుడు ద్వారా చర్చించి అవసరమైన మార్పులును చేసి A4 తెల్ల కాగితమనందు గుండ్రటి అక్షరాలతో స్వదస్తూరితో ఒక వైపు రాసి గరిష్టంగా 2 పేజీల లోపు పూర్తి చేయవలెను.
నాటిక రచనల పోటీ : ఇది కేవలం విభాగం 2 (8మరియు 9) విద్యార్దులకు మాత్రమే. విద్యార్థి తనకు నచ్చిన అంశాన్ని తీసుకొని గరిష్టంగా 20 నుండి 25 పేజీల వరకు నాటకాన్నీ పేజీకీ ఒక వైపు గుండ్రటి అక్షరాలతో రాయవలెను. ఉత్తమంగా రాసిన నాటికను తగిన మార్పులు చేర్పులు చేసి భవిష్యత్తులో ప్రదర్శన చేయడం జరుగుతోంది.
ఛాయ చిత్రాల పోటీ : ఇది కేవలం విభాగం 2 (8 మరియు 9 తరగతి) విద్యార్దులు కు మాత్రమే. విద్యార్దులు తల్లి దండ్రులు లేదా బంధువుల వద్ద మొబైల్ ఫోన్ ద్వారా గ్రామ పరిసర ప్రాంతాలు లేదా గ్రామంలో జరిగిన వివిధ అంశాలు లేదా అందమైన విషయాలను ఛాయ చిత్రాలుగా తీసి ఫోటో స్టూడియో లో కడిగించి ఫోస్ట్ ద్వారా పైన తెలిపిన 2నుండి 8 పాయింట్లు గమనించి పంపించగలరు.
విభాగం 3. ఈ విభాగం విదేశాల్లో ఉండే శ్రీకాకుళం జిల్లా వాసులకు. ఈ విభాగం నందు ఎంట్రీ లు ప్రత్యేకంగా పరిశీలించబడును. విదేశీ ఎంట్రీలు కేవలం ఈ మెయిల్ ద్వారా స్వీకరించబడును. ఎంట్రీలతో పాటు స్టడీ సర్టిఫికేట్, హామి పత్రం, బయోడేటా మరియు క్లాస్ టీచర్ చే కాండక్ట్ సర్టిఫికేట్ జిప్ ఫైల్ ద్వారా పంపించగలరు. విద్యార్థులు రాసినవి తల్లి దండ్రులు అవసరమైన భాష పరమైన విషయాలయందు సహాయం చేయవచ్చు.
ప్రత్యేక సూచనలు:
I. ప్రతి ధరఖాస్తు ప్రదానోపాద్యుని సంతకం మరియ స్టాంప్ కలిగి యుండవలెను.(అట్లు లేని యెడల పరిశీలనకు పరిగినించబడదు)
II.మీ బంధువుల్లో ఎవరైనా విదేశాల్లో ఉంటే వారి ధరఖాస్తులు ఆన్లైన్ ద్వారా పంపించ గలరు.(విభాగం 3 చదవగలరు)
III. పైన తెలిపిన 2 నుండి 8 వరకు గల అంశాలను పరిశీలించి గలరు.
IV. ప్రతీ పాఠశాల నుండి, ప్రతీ విభాగం నుండి, ప్రతీ పోటీ కు గరిష్టంగా 5 ధరఖాస్తులను పంపించ వలెను. (అనగా ఒక్కోక్క పాఠశాల నుండి అన్ని పోటీలకు కలిపి గరిష్టంగా 140 ధరఖాస్తులు మాత్రమే పంపించ గలరు.)
V. ధరఖాస్తులు రిజస్టర్ పోస్ట్ ద్వారా లేదా పైన పేర్కొన్న విధంగా ఈ మెయిల్ ద్వారా పంపించగలరు.
VI. మాకు అందిన ధరఖాస్తులుకు పోస్ట్ ద్వారా 3 రోజుల్లో ఎక్నాలెడ్జ్మెంట్ కార్డు ద్వారా మరియు ఆటోమెటిక్ మెయిల్ ద్వారా వెనువెంటనే రిప్లై మెయిల్ వచ్చినట్ట్లైతే మీ ధరఖాస్తు స్వీకరించబడింది అని అర్ధం.
VII. అనుభవఙ్ఞులైన ఉపాధ్యాయ బృందం మరియు రాయల్ థియేటర్ సొసైటీ మెంబర్స్ ఎంట్రీలను పరిశీలించి విజేతలను ప్రకటిస్తారు.
VIII. ప్రతి విభాగం నందు మరియు ప్రతి పోటీ యందు ప్రధమ బహుమతి రూ.516, ద్వితీయ బహుమతి రూ.216 తృతీయ బహుమతి 116 పారితోషకం,మెమెంటో మరియు ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరుగుతోంది. (పారితోషకం అప్లికేషన్లో తెలుపబడిన బ్యాంక్ అకౌంట్ నందు జమచేయడం జరుగుతుంది). మిగిలిన విద్యార్దులకు పోస్ట్ ద్వారా ప్రశంసా పత్రాలు సెప్టంబర్ మొదటి వారం లోపు అందజేయడం జరుగుతుంది.
VIII B. NRI విద్యార్దులకు కేవలం ప్రశంసా పత్రం మరియు మెమెంటో బంధువులకు అందజేయడం జరుగుతోంది.
IX. విజేతలు తమ ప్రదానోపాద్యుడు లేదా తరగతి ఉపాద్యాయుడు తో 15, ఆగష్టు 2015 సాయంత్రం పొందూర్లో జరగబోయే కార్యక్రమానికి హాజరు కాగలరు. రాను పోనూ ఖర్చులు సోసైటీకీ బస్ లేదా ట్రైన్ టికెట్ జమచేయడం ద్వారా డబ్బులు తిరిగి పొందవచ్చు.
X. కార్యక్రమానికి సంబందించిన పూర్తి వివరాలతో కూడిన సమాచారం మే మూడవ వారంలో www.royaalatheatre.wordpress.com నందు పరిశీలించ గలరు.
XI. ప్రతి ఉపాద్యాయుడు లేదా పాఠశాల నుండి ఏదైనా ఉపాద్యాయుడు What’s app ద్వారా 9493938573 అను నంబరు యందు గాని, facebook ద్వారా లేదా మెయిల్ ద్వారా మే చివరి వారం నుండి ఆగష్ట్ 15 వరకు ఉత్తర ప్రత్యుత్తారాలు జరపడానికి అందుబాటులో ఉండవలెను
XII. పోటీలకీ సంబందించిన తుది నిర్ణయం రాయల థియేటర్ సెక్రటరీ మరియు ప్రెసిడెంట్ తీసుకోవడం జరుగుతుంది.
Follow us on Face Book :https://www.facebook.com/royaalatheatresociety
Whats app Number: +91 9493938573
ఇట్లు,
(వడగా. సురేష్)
సెక్రటరీ
రాయల థియేటర్ సొసైటీ
2_70
మూగోడి వారి వీధి
పొందూరు
శ్రీకాకుళం జిల్లా
ఆంధ్ర ప్రదేశ్ 532168
+91 9177211393 +919989614901
email: royaalatheatre@gmail.com